రెజీనాతో అఫైర్ అనేది ఓ పుకారు .. ఆ రూమర్ కి కారణం అదే అయ్యుంటుంది: నారా రోహిత్
- రెజీనాతో 'శంకర' .. 'జ్యోఅచ్యుతానంద' చేసిన నారా రోహిత్
- తాజాగా ఈ కాంబినేషన్లో 'బాలకృష్ణుడు'
- అందులో నిజం లేదు .. అవన్నీ పుకార్లే
"రెజీనాతో అఫైర్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ ప్రచారాన్ని నేను సీరియస్ గా తీసుకోవడం లేదు .. ఎందుకంటే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు" అన్నాడు. "గతంలో మేమిద్దరం 'శంకర' .. 'జ్యో అచ్యుతానంద' సినిమాలు చేశాం .. తాజాగా 'బాలకృష్ణుడు' చేశాం. ఇలా మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేస్తుండటం ఈ పుకార్లకు కారణమయ్యుంటుంది. వృత్తిపరంగా కలిసి పనిచేయడం తప్ప ..మా మధ్య మరేమీ లేదు" అంటూ చెప్పుకొచ్చాడు. 'బాలకృష్ణుడు' ఈ నెల 24వ తేదీన విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.