జీవిత భాగస్వామి కోసం తమిళ నటుడు ఆర్య ప్రకటన.. 'రియాలిటీ షో' కోసం వినూత్న ప్రచారం!
- తనకు భార్య అవ్వాలనుకుంటున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడి
- వీడియో మెసేజ్ ద్వారా సమాచారం తెలిపిన నటుడు
- 'మాపిల్లై ఆర్య' అనే రియాలిటీ కోసం ఈ ప్రయత్నం
'సాధారణంగా జీవిత భాగస్వామి కోసం స్నేహితులనో, మాట్రిమోని సైట్లనో సంప్రదిస్తారు. కానీ నేను అలా కాదు. భాగస్వామి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్లు, షరతులు లేవు. నేను మీకు నచ్చితే, మంచి భర్త అవుతాననే నమ్మకం ఉంటే 73301 73301 నెంబర్‌కి కాల్ చేయండి. ఇది జోక్ కాదు. గిమ్మిక్కు కాదు. నా జీవితానికి సంబంధించిన విషయం. దయచేసి కాల్ చేయండి. మీ కాల్ కోసం ఎదురుచూస్తున్నా!' అని ఆర్య వీడియోలో తెలిపాడు.
వీడియోలో చెప్పిన నెంబర్‌కి కాల్ చేస్తే మీకొక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో www.mapillaiarya.com లింక్ ఉంటుంది. ఆ సైట్‌లో తన భాగస్వామి కావాలనుకున్న వారు వివరాలు నింపాలని సూచనలు ఉంటాయి. అక్కడున్న వివరాలన్నీ నింపి ఫొటో, వీడియో అప్‌లోడ్ చేయాలి. ఆ సైట్లో షరతులు, ఆడిషన్స్ గురించి తెలిపారు. దీన్ని బట్టి ఇది రియాలిటీ షో కోసమని అర్థం చేసుకోవచ్చు.