ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయలేదు: నారా రోహిత్
- సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాను
- 21 కిలోల బరువు తగ్గాను
- విలన్ గా అజయ్ మెప్పిస్తాడు
ఈ తరహా సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను .. ఈ సినిమాతో ఆ ముచ్చట తీరిందని అన్నాడు. ఈ సినిమాలో నా పాత్ర పేరు 'బాలు' .. డబ్బు కోసం ఏమైనా చేసే పాత్ర ఇది. ఈ సినిమా కోసం 21 కిలోల బరువు తగ్గాను. పూర్తిస్థాయిలో కాదు గానీ .. సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాను. రెజీనా కథానాయికగా అలరిస్తుంది.. అజయ్ విలన్ గా కనిపిస్తాడని అన్నాడు. కథాకథనాలను నడిపించడంలోను .. పాత్రలను తీర్చిదిద్దడంలోను దర్శకుడు పవన్ మల్లెల తనదైన ప్రత్యేకత చూపించాడని చెప్పుకొచ్చాడు.