వారణాసికి బయల్దేరనున్న 'అజ్ఞాతవాసి'!
- తదుపరి షెడ్యూల్ వారణాసిలో
- ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి
- వచ్చేనెల 15న ఆడియో రిలీజ్
అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల 15వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించి, సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారు. పవన్ 25వ సినిమాగా .. త్రివిక్రమ్ తో చేస్తోన్న మూడవ సినిమాగా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు వున్నాయి.