చెప్పినట్టుగానే 'సింహా'లా వచ్చారు.. హ్యాట్సాఫ్ టు బాలయ్య!: యాంకర్ ఉదయభాను
- బాలయ్యలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు
- పిల్లలను ఆశీర్వదించి, సరదాగా గడిపారు
- 45 నిమిషాలు మాతోనే ఉన్నారు
తన జీవితంలో మొట్టమొదటి పండుగ తన పిల్లల తొలి పుట్టిన రోజే అని భాను తెలిపింది. సినీ పరిశ్రమకు చెందినవారి సమక్షంలో వేడుకలు జరుపుకోవాలని అనుకున్నామని... చాలా మందికి ఫోన్ చేసినప్పటికీ ఎవరూ లిఫ్ట్ చేయలేదని చెప్పింది. చివరకు బాలయ్యకు ఓ మెసేజ్ పెట్టగా, రావడానికి ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారని తెలిపారు. తర్వాతి రోజు మీటింగ్ ఉందని... అయినా వచ్చి వెళతానని చెప్పారని... చెప్పినట్టుగానే సింహాలాగా వచ్చారని ఎంతో సంతోషంగా తెలిపింది. ఆ సమయంలో ఆయన నాకు ఒక దేవుడిగా కనిపించారని చెప్పింది. అందరు సెలబ్రిటీల్లా ఐదు నిమిషాలు ఉండి వెళ్లిపోకుండా... 45 నిమిషాల పాటు సరదాగా గడిపి, అందరితో ఫొటోలు దిగి వెళ్లారని తెలిపింది. బాలయ్యలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారని... హ్యాట్సాఫ్ బాలయ్య అంటూ పొగడ్తలు కురిపించింది.