వినాయక్ క్లాప్ తో గోపీచంద్ న్యూ మూవీ ప్రారంభం
- చక్రి దర్శకత్వంలో గోపీచంద్
- రామానాయుడు స్టూడియోలో ప్రారంభం
- పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్
- హీరోయిన్ గా మెహ్రీన్
హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. నాయకా నాయికలపై వినాయక్ క్లాప్ కొట్టడంతో, ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. గోపీచంద్ ఖాతాలో యాక్షన్ ఎంటర్టైనర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తరహా సినిమాలే ఆయనకి ఎక్కువగా సక్సెస్ లు తెచ్చిపెట్టాయి కూడా. మరి ఈ సారి కూడా ఈ సినిమాతో గోపీచంద్ కి హిట్ పడుతుందేమో చూడాలి మరి.