లవర్స్ కు తోడుగా వెళ్లి లవ్ లో పడ్డాము... వాళ్లు పెళ్లి చేసుకోలేదు, మేము మాత్రం చేసుకున్నాం!: 'జై లవకుశ' దర్శకుడు బాబీ లవ్ స్టోరీ!
- 'జై లవకుశ' విజయంతో మరింత పేరు
- చెస్ చాంపియన్ హారిక సోదరి అనూషను ప్రేమించిన బాబీ
- అనూష కోసమే హైదరాబాద్ కు
- ఆసక్తికర విషయం చెప్పిన బాబీ
ప్రేమికులిద్దరూ వాళ్ల పనిలో వాళ్లుంటే, తాము కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లమని, అలా అలా పరిచయం పెరిగి, స్నేహంగా మారి, హృదయాలు దగ్గరయ్యాయని అన్నాడు. ఆపై కులాలు వేరు కావడంతో, ఇంట్లో చెబితే, స్థిరపడిన తరువాత పెళ్లి గురించి ఆలోచించమని సలహా ఇచ్చారని, తానసలు అనూష కోసమే హైదరాబాద్ వచ్చానని అన్నాడు. అనూషకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో, అప్పటికే 'భద్రాద్రి' చిత్రానికి కథ అందించిన పరిచయంతో నటుడు శ్రీహరికి విషయం చెప్పగా, అనూష కుటుంబానికి దగ్గర బంధువైన చలపతిరావుతో మాట్లాడి తమ పెళ్లిని దగ్గరుండి చేయించాడని చెప్పాడు. ఎవరి ప్రేమకోసమైతే, తోడుగా తాము వెళ్లామో, వారిద్దరూ మాత్రం పెళ్లి చేసుకోలేదని అన్నాడు.