పూరీ అంటే ఇష్టం .. త్రివిక్రమ్ అంటే గౌరవం: బండ్ల గణేశ్
- ఏదైతే చెబుతాడో పూరీ అదే తీస్తాడు
- సినిమాను త్రివిక్రమ్ ప్రేమిస్తాడు
- ఇలాంటివాళ్లు ఇండస్ట్రీకి అవసరం
"రైటా . . రాంగా అనేది పక్కన పెడితే ఫటా ఫటా మంటూ సినిమాలు చేసేస్తాడు. ఏదైతే కథ చెబుతాడో .. ఏదైతే సీన్ చెబుతాడో అదే సినిమాలో ఉంటుంది .. ఎక్స్ ట్రాగా ఒక్క షాట్ కూడా ఉండదు . అందుకే పూరీ అంటే ఇష్టం. ఇక సినిమా అంటే భక్తి .. భయం ఉంటూ సినిమాను ప్రేమిస్తూ సినిమానే జీవితంగా బతికేవాడు త్రివిక్రమ్ .. అందుకే ఆయనంటే నాకు గౌరవం. ఇండస్ట్రీ చల్లగా వుండాలని కోరుకునే వాళ్లలో త్రివిక్రమ్ ఒకరు .. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం" అని చెప్పుకొచ్చారు.