రవితేజ కోసం అనుకున్న కథ గోపీచంద్ కి వెళ్లింది!
- చక్రి దర్శకత్వంలో గోపీచంద్
- గతంలో రవితేజకి వినిపించిన కథే
- కథానాయికగా మెహ్రీన్
- రేపు ఉదయం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం
అయితే 'రాబిన్ హుడ్' కాకుండా మరో టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో 'బెంగాల్ టైగర్' ను నిర్మించిన రాధామోహన్, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. దిల్ రాజు .. వినాయక్ .. సురేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు సమాచారం.