'పద్మావతి' హీరోయిన్ దీపిక పదుకునేని చంపితే రూ.5 కోట్లు ఇస్తాం: కర్ణిసేన ప్రకటన
- వివాదాల చుట్టూ తిరుగుతోన్న బాలీవుడ్ సినిమా పద్మావతి
- ఈ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు
- ఇప్పటికే హీరోయిన్ ముక్కు కోయాలని కర్ణిసేన పిలుపు
ఆ హీరోయిన్ ముక్కుకోయాలని, ఆ సినిమా ప్రదర్శితమయ్యే సినిమా థియేటర్లను దగ్ధం చేయాలని ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొన్ని సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తీసిన ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు ఉన్నాయి.