జూనియర్ ఎన్టీఆర్ 'టెంపర్' హిందీ రీమేక్‌లో రణ్‌వీర్ సింగ్?
- దర్శకత్వం వహించనున్న రోహిత్ శెట్టి
- రణ్‌వీర్ సరసన జాహ్నవి కపూర్ కాదన్న దర్శకుడు
- హీరోయిన్‌ను ఇంకా అనుకోలేదని వివరణ
'అసలు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుడతాయో తెలీదు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ విషయం ఆలోచించనే లేదు. వచ్చే ఏడాది మొదట్లో చిత్ర ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తవుతుంది. ఆ తర్వాత నటీనటులు ఎవరనే విషయాన్ని నిర్ణయిస్తాం' అని రోహిత్ శెట్టి అన్నాడు. మాతృక నుంచి కేవలం 20 శాతం కథాంశాన్ని మాత్రమే తీసుకుంటామని, మిగతా మొత్తాన్ని బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మారుస్తామని రోహిత్ వివరించాడు.