'రంగుల రాట్నం' కోసం నాగ్ భారీగానే ఖర్చు చేశారట!
- అన్నపూర్ణ బ్యానర్లో రాజ్ తరుణ్
- ఒక సాంగ్ మినహా 'రంగుల రాట్నం' షూటింగ్ పూర్తి
- కథలో భాగంగా మ్యారేజ్ ఎపిసోడ్స్
- ఖర్చుకు వెనుకాడని నాగార్జున
కొత్త దర్శకురాలితో .. కొత్త హీరోయిన్ తో నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'రారండోయ్ వేడుక చూద్దాం' మాదిరిగా ఈ సినిమా సందడిగా .. కలర్ ఫుల్ గా వుండాలని నాగ్ చెప్పారట. కథా పరంగా మూడు .. నాలుగు మ్యారేజ్ ఎపిసోడ్స్ ఉండటంతో, ఖర్చుకు వెనకాడకుండా మంచి అవుట్ ఫుట్ వచ్చేలా చూశారట. ప్రతి సీన్ గ్రాండ్ లుక్ తో ఉండేలా చూడటంతో, ఫస్టు కాపీకే నాలుగు కోట్ల వరకూ ఖర్చు అయిందని అంటున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నంలో నాగార్జున వున్నారని సమాచారం.