'సైరా' కోసం విదేశాల నుంచి 200 మంది జూనియర్ ఆర్టిస్టులు!
- డిసెంబర్ 6వ తేదీన సెట్స్ పైకి 'సైరా'
- తొలి షెడ్యూల్లో పోరాట సన్నివేశాల చిత్రీకరణ
- ఆంగ్లేయ సైన్యం కోసం విదేశాల నుంచి జూనియర్ ఆర్టిస్టులు
- హైదరాబాద్ శివారుల్లో చిత్రీకరణ
అందుకోసం విదేశాల నుంచి 200 మంది జూనియర్ ఆర్టిస్టులను రప్పిస్తున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఫస్టు షెడ్యూల్ లోనే భారీ పోరాట సన్నివేశాలను ప్లాన్ చేయడం విశేషం. ఈ సన్నివేశాలను కొత్తగా డిజైన్ చేయించిన దర్శకుడు సురేందర్ రెడ్డి .. తనదైన శైలిలో ఆ సన్నివేశాలను చిత్రీకరించడానికి రెడీ అవుతున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, పలువురు బాలీవుడ్ నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.