shivaji raja: ఒక పెద్ద హీరో నాకు ఫోన్ చేసి మరీ నీతులు చెప్పాడు: శివాజీరాజా
- మా అమ్మానాన్నలకు ఒక ఆర్టిస్ట్ లేనిపోనివి చెప్పాడు
- ఆ మాటలు నిజమని వాళ్లు నమ్మేశారు
- కొంతమంది శ్రీకాంత్ ను ఆరాతీశారు
- ఆ సమయంలో నన్ను ఆ ఇద్దరే సపోర్ట్ చేశారు
తాజాగా ఐ డ్రీమ్స్ తో శివాజీరాజా మాట్లాడుతూ .. తన జీవితంలో మరిచిపోలేని మరో సంఘటనను గురించి ప్రస్తావించారు. " మా మదరూ ఫాదర్ ఇద్దరూ కూడా మా అబ్బాయి మమ్మల్ని చూసుకోవడం లేదని టీవీలకెక్కారు. నాకు ఎదురైన ప్రమాదాల్లో ఇది అన్నిటికంటే పెద్దదని నా అభిప్రాయం. " మీ అబ్బాయికి 100 ల కోట్ల ఆస్తి వుంది .. మీరేంటి ఇంకా 'పెంట్ హౌస్' లో వుంటారు" అని నా తోటి ఆర్టిస్ట్ మా పేరెంట్స్ కి లేనిపోనివి చెప్పాడు. వాళ్ల బుర్రలోకి విషం ఎక్కించడంతో ఆ క్షణంలో వాళ్లు ఆ మాటలు నమ్మేశారు" అని అన్నారు.
"నేనేంటో తెలిసిన కొంతమంది కూడా ఈ విషయంలో వాళ్ల నిజస్వరూపాన్ని చూపించారు. శ్రీకాంత్ కి ఫోన్ చేసి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక ఒక పెద్ద హీరో అయితే నాకు ఫోన్ చేసి .. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనే విషయంలో నీతులు చెప్పేశాడు. ఆ సమయంలో నన్ను సపోర్ట్ చేస్తూ ఇద్దరంటే ఇద్దరే ఫోన్ చేశారు. "అన్నా నువ్వెలాంటి వాడివో మాకు తెలుసు .. నువ్ బంగారానివి" అన్నారు. "ఆ ఇద్దరూ ఎవరో కాదు .. పోసాని కృష్ణమురళి .. వేణుమాధవ్" అంటూ చెప్పుకొచ్చారు.