మెహ్రీన్ అదృష్టం మాములుగా లేదు .. మరో భారీ సినిమాకి గ్రీన్ సిగ్నల్
- యూత్ లో మెహ్రీన్ కి పెరిగిపోతోన్న క్రేజ్
- వచ్చేనెల 1న 'జవాన్' విడుదల
- తాజాగా గోపీచంద్ సరసన ఛాన్స్
- దర్శకుడిగా చక్రి పరిచయం
గ్లామర్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈ సుందరిని సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆమె మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. గోపీచంద్ హీరోగా దర్శకుడు చక్రి ఒక సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, చివరికి మెహ్రీన్ ను ఖరారు చేశారట. ఈ విషయంతో పాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలో వెల్లడి చేయనున్నారు.