షాపింగ్ మాల్ లో బన్నీ షూటింగ్ సందడి!
- తాజా షెడ్యూల్ లో 'నా పేరు సూర్య'
- ప్రధాన తారాగణంపై షాపింగ్ మాల్ లో షూటింగ్
- విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్
- ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు
దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది మొదటి చిత్రం. అయినా ఎంతో అనుభవం వున్న వాడిలా చిత్రీకరణ చేస్తున్నాడట. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ పట్ల నిర్మాతలు సంతృప్తిగా వున్నారని అంటున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు.