lavanya tripathi: సినిమాల్లో నా తొలి ముద్దు నానికి ఇచ్చాను: లావణ్య త్రిపాఠి
- సినిమాల్లోకి వచ్చిన తరువాత తొలి ముద్దు నానికి పెట్టాను
- నా తొలి డైలాగ్ 'త్వరగా నాకు పెళ్లి చేసెయ్యండి నాన్నా'
- మోడలింగ్ ద్వారా వచ్చిన తొలి పారితోషికం 5,000 అమ్మకిచ్చేశా
సినిమాల్లోకి వచ్చిన తరువాత తొలిముద్దు నానికి పెట్టానని సినీ నటి లావణ్య త్రిపాఠి తెలిపింది. తనకు సంబంధించిన పలు విశేషాలను ఈ ముద్దుగుమ్మ తాజాగా వెల్లడించింది. మిస్ ఉత్తరాఖండ్ గా గెలుపొందిన తరువాత సక్సెస్ అంటే ఏమిటో అర్థమైందని చెప్పింది. చాలామంది కెమెరా అనగానే భయపడతారని, తాను మాత్రం అలా కాదని, కెమెరా ముందుకు రాగానే తాను లావణ్య అన్న విషయాన్ని మర్చిపోతానని తెలిపింది. పాత్ర మాత్రమే గుర్తుంటుందని, డైరెక్టర్ చెప్పింది మాత్రమే తాను గుర్తుంచుకుంటానని చెప్పింది.
ఇక సినిమాలలో ముద్దు సన్నివేశాల గురించి చెప్పాలంటే, తొలి ముద్దును ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో నాని బుగ్గపై పెట్టానని అంది. అలాగే సినిమాల్లో తొలి డైలాగు ఏమిటంటే, 'త్వరగా నాకు పెళ్లి చేసెయ్యండి నాన్న' అన్న డైలాగ్ అని చెప్పింది. మోడలింగ్ లో తొలిసారి ర్యాంప్ వాక్ చేసినప్పుడు 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చారని దానిని తన తల్లికి ఇచ్చేశానని తెలిపింది. తన తొలి సినిమా పారితోషికం కూడా తన తల్లికి ఇచ్చేశానని ఆమె వెల్లడించింది.