కలెక్టర్ గా నయనతార అదరగొట్టేసిందట .. లేడీ సూపర్ స్టార్ అంటూ టాక్!
- తమిళంలో నిన్ననే విడుదలైన 'అరమ్'
- తొలి ఆటతోనే హిట్ టాక్
- కలెక్టర్ గా నయన్ నటనకు ప్రశంసలు
- 'కర్తవ్యం' పేరుతో త్వరలో తెలుగులోకి
గ్రామాల్లో త్రాగునీరుతో పాటు కనీస వసతులు కల్పించాలని ప్రజల తరఫున నిలిచి పోరాడే పాత్రలో ఆమె నటన అద్భుతం అనేస్తున్నారు. విమర్శకులు సైతం ఆమె నటనపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా తరువాత నయనతార 'లేడీ సూపర్ స్టార్' అని పిలిపించుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథా కథనాలు .. టేకింగ్ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. త్వరలో 'కర్తవ్యం' పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.