ఏయ్, ఇలారా!...మా ఆవిడ ఫోటోలు ఎలా తీశావో చూపించు!: ఫొటోగ్రాఫర్ పై ఫైర్ అయిన అభిషేక్ బచ్చన్
- మనీష్ మల్హోత్రా పార్టీకి హాజరైన అభిషేక్, ఐశ్వర్యారాయ్
- ఫొటోల కోసం ఎగబడ్డ ఫొటోగ్రాఫర్లు
- తన భార్య ఫోటోలు ఎలా తీశావో చూపించు అంటూ ఫోటోగ్రాఫర్ ను అడిగిన అభిషేక్
తీయలేదని ఫోటోగ్రాఫర్ చెప్పడంతో అనుమానం తీరని అభిషేక్.. కెమెరాలోని ఫోటోలు చూపించాలని అడిగాడు. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ వాటిని చూపించడంతో మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు. కాగా, ఈ పార్టీకి ఐశ్వర్యాయ్ మోకాళ్లపైకి ఉండే డెనిమ్ గౌన్ ధరించి హాజరైంది. దీంతో కూర్చునేటప్పుడు తీసిన ఫోటోలు అసభ్యంగా ఉన్నాయేమోనని అభిషేక్ భావించాడు. అందుకే, ఫోటోలు చూపించమని అడిగాడు.