'సాంబ' సినిమాలో ఆ సీన్ నేను తీసుండకూడదు .. ఇప్పటికీ బాధపడుతూనే ఉంటా : వినాయక్
- 'సాంబ' సినిమాలో ఒక చెత్త సీన్ వుంది
- కెమెరా పెట్టి కూడా వద్దనుకుని తీసేశా
- కానీ ఆ సీన్ తీయవలసి వచ్చింది
- ఎడిటింగ్ లోను తీసేయలేకపోయాను
"ఏ సినిమాలోనైనా సరే .. ఈ సీన్ ను నేను ఇలా తీశానేంటి? అని ఎప్పుడైనా ఫీలయ్యారా? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు వినాయక్ స్పందిస్తూ .. "ఛ .. ఈ సీన్ నేను తీసుండకూడదు అని నేను ఫీలైన సినిమా మాత్రం 'సాంబ'. అందులో ఒక చెత్త సీన్ ఉంటుంది .. దాని గురించి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ చెత్త సీన్ తీయడం ఇష్టం లేక .. కెమెరా పెట్టి కూడా తీసేశా. బానే వుంది కదా .. ఏవైంది అంటూ కొంతమంది ఒత్తిడి చేయడంతో .. నా వలన షూటింగ్ ఆగిపోకూడదని చేశాను .. ఎడిటింగ్ లోను తీయలేకపోయాను. ఎప్పటికీ నాకు అదొక బాధే .. నేను ఆ సీన్ తీసుండకూడదనే అనుకుంటా" అంటూ చెప్పుకొచ్చారు.