త్రివిక్రమ్ .. దేవిశ్రీప్రసాద్ మధ్య మనస్పర్థలా?
- త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ లది హిట్ కాంబినేషన్
- 'అ ఆ' సినిమాకి మాత్రం మిక్కీ జె. మేయర్ కి ఛాన్స్
- 'అజ్ఞాతవాసి'కి అనిరుథ్ కి అవకాశం
- ఎన్టీఆర్ మూవీ కూడా అనిరుథ్ కే!
ఈ నేపథ్యంలో 'అ ఆ' సినిమాకి సంగీత దర్శకుడిగా మిక్కీ జె. మేయర్ కి త్రివిక్రమ్ అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ బిజీగా ఉండి ఉండటం అందుకు కారణం కావొచ్చని అనుకున్నారు. ఆ తరువాత సినిమా అయిన 'అజ్ఞాతవాసి'కి అనిరుథ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయనున్న ప్రాజెక్టుకు కూడా అనిరుథ్ నే ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ .. దేవిశ్రీప్రసాద్ మధ్య మనస్పర్థలు వచ్చి ఉండొచ్చనే గుసగుసలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతన్నది చూడాలి మరి.