పెద్ద బ్యానర్ .. స్టార్ డైరెక్టర్ .. అయినా అనుపమ నో చెప్పేసిందట! కారణం .. ఇదే!
- యూత్ లో అనుపమకు విపరీతమైన క్రేజ్
- వరుసగా వస్తోన్న అవకాశాలు
- కెరియర్ పట్ల స్పష్టతతో వున్న అనుపమ
ఈ సినిమాలో కథ మధ్యలోనే ఆమె పాత్ర చనిపోతుంది. ఈ సినిమా తరువాత ఆమెకి ఓ ఆఫర్ వచ్చింది. పెద్ద బ్యానర్లో .. స్టార్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమా అది. ముందు ఎగిరిగంతేసిన అనుపమ .. ఆ తరువాత కథ విని ఉసూరుమందట. ఈ సినిమాలోను మధ్యలోనే చనిపోయే పాత్ర కావడమే అందుకు కారణం. అందువల్లనే ఆమె .. వెంటనే అదే తరహా పాత్రను చేయలేనంటూ సున్నితంగా తిరస్కరించిందట. ఈ కారణంగా పెద్ద సినిమాను వదిలేసుకుందంటే .. అనుపమ పక్కా ప్లానింగ్ తోనే ఉందనుకోవాలి మరి.