వెంకీ సినిమా కోసం అడిగితే తమన్నా అలా తప్పుకుందట!
- తేజ దర్శకత్వంలో వెంకీ మూవీ
- పరిశీలనలో 'ఆటా నాదే వేటా నాదే' టైటిల్
- కథానాయిక కోసం అన్వేషణ
ప్రస్తుతం తమన్నా మరీ అంత బిజీగా ఏంలేదు. ఈ సినిమా చేయడం ఇష్టం లేకనే ఆమె అలా చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. దాంతో 'నేనే రాజు నేనే మంత్రి' సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని కాజల్ తప్పకుండా చేస్తుందనే ఉద్దేశంతో ఆమెను అడిగారట. అయితే ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసినట్టు వినికిడి. కాజల్ కూడా ఈ ప్రాజెక్టు చేయడం ఇష్టం లేకనే పారితోషికం భారీగా అడిగిందనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ విషయంలో ఈ సినిమా టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.