రానాతోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ!
- 'ఫిదా'తో హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల
- ఆయన తదుపరి సినిమాపై అందరిలోను ఆసక్తి
- రానాకి లైన్ వినిపించిన కమ్ముల
- పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో బిజీ
ముందు నితిన్ తో గానీ .. విజయ్ దేవరకొండతో గాని ఒక సినిమా చేద్దామని శేఖర్ కమ్ముల అనుకున్నాడట. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో, రానాతోనే సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఆల్రెడీ ఆయన రానాకి ఒక లైన్ వినిపించడం .. ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో శేఖర్ కమ్ముల వున్నాడని చెబుతున్నారు. అయితే అంతా అనుకుంటున్నట్టుగా ఇది 'లీడర్' సీక్వెల్ కాదు .. కొత్త కథ.