ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన పుకార్లకు చెక్ పెట్టిన త్రివిక్రమ్
- త్రివిక్రమ్ తాజా చిత్రంగా 'అజ్ఞాతవాసి'
- తదుపరి సినిమా ఎన్టీఆర్ తో
- ఓ నవల ఆధారంగా అంటూ ప్రచారం
- తాజాగా ఈ విషయంపై స్పందించిన త్రివిక్రమ్
ఈ రోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్న త్రివిక్రమ్ ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్ తో తాను చేయనున్న సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కనుందనే విషయంలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. తన గత చిత్రాల మాదిరిగానే కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఈ సినిమా వుంటుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం 'టబు' ఖరారైపోయింది.