త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఫోటోస్ రిలీజ్ చేసిన 'అజ్ఞాతవాసి' టీమ్
- 'అజ్ఞాతవాసి' షూటింగులో త్రివిక్రమ్
- ఈ రోజున త్రివిక్రమ్ పుట్టినరోజు
- శుభాకాంక్షలు అందజేసిన టీమ్
ఈ రోజున త్రివిక్రమ్ పుట్టినరోజు .. పవన్ సినిమా సెట్స్ పై ఉండగా ఆయన పుట్టినరోజు రావడం విశేషం. పవన్ కి ఇది 25వ సినిమా కావడం .. ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ బర్త్ డే రావడం యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. దాంతో వాళ్లంతా కూడా త్రివిక్రమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి సంబంధించిన స్పెషల్ ఫోటోలను రిలీజ్ చేశారు. వీటిలో .. సోఫాపై పవన్ పక్కనే కూర్చున్న ఆయన ఫోటో, వాళ్లిద్దరి స్నేహానికి అద్దం పడుతోంది. పవన్ ఫ్యాన్స్ ముచ్చట పడేలా చేస్తోంది.