కాలేజ్ రోజుల్లో అమ్మాయిలు నన్ను పట్టించుకోలేదు .. హీరోనయ్యాక వెంటపడ్డారు : కార్తీ
- హిట్ సినిమాతో పాటే పుకార్లు వస్తాయి
- నాకూ . . తమన్నాకి సంబంధించిన వార్తలు అలాంటివే
- నేను సీరియస్ గా తీసుకోలేదు
- అదో నైస్ ఫీలింగ్ .. అంతే
"స్పైసీ న్యూస్ కోసం కొంతమంది ఇలాంటివి సృష్టిస్తూ ఉంటారు .. ఒక రకంగా ఇలాంటి వార్తలను ఎంజాయ్ చేస్తాను" అన్నారు. "కాలేజ్ లో చదువుకునేటప్పుడు ఒక్క అమ్మాయి కూడా నా వైపు చూడలేదు. ఆ తరువాత హీరోగా లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు .. నన్ను పెళ్లి చేసుకో .. నన్ను పెళ్లి చేసుకో .. అని వెంటపడేవారు. ఆ మాటలను నేను సీరియస్ గా తీసుకోలేదు గానీ .. ఆ ఏజ్ లో నాకు అదొక నైస్ ఫీలింగ్ అనిపించింది" అని చెప్పుకొచ్చారు.