త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న పవన్ కల్యాణ్ కొత్త సినిమాలోని తొలిపాట!
- ఈ నెల 7న విడుదల
- సినిమా టైటిల్‌ను కూడా ప్రకటిస్తారని అంచనా
- పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు
ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే పేరు పెడతారని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జవవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. గతంలో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.