అందాల కైరా అద్వాని అదృష్టవంతురాలే!
- 'భరత్ అను నేను'లో మహేశ్ జోడీగా కైరా అద్వాని
- ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయం
- తమిళ తెరకి పరిచయం చేయనున్న మురుగదాస్
- విజయ్ సరసన ఛాన్స్
'మెర్సల్' హిట్ తో మాంచి ఉత్సాహంతో వున్న విజయ్ తో మురుగదాస్ ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ ను గానీ .. సోనాక్షిని గాని తీసుకోవాలని మురుగదాస్ భావించాడట. అయితే గతంలో ఆ ఇద్దరితోను మురుగదాస్ చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు. అందువలన కాస్త కొత్తగా అనిపించే మరో హీరోయిన్ ను ట్రై చేయమని విజయ్ అనడంతో, కైరా అద్వానిని మురుగదాస్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె ఎంపిక పట్ల విజయ్ కూడా సుముఖంగా వున్నాడని టాక్.