'టబు' విషయంలో ఆలోచనలోపడిన త్రివిక్రమ్ .. కారణం ఎన్టీఆర్?
- త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో
- కీలకమైన పాత్ర కోసం 'టబు'ను తీసుకుంటారంటూ ప్రచారం
- ఈ విషయంలో ఎన్టీఆర్ అభిప్రాయమంటూ ఓ టాక్
అలాగే ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన 'టబు'ను ఎంపిక చేసే ఆలోచనలో వున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే పాత్ర పరంగా 'టబు' సెట్ కాదనే అభిప్రాయాన్ని ఎన్టీఆర్ వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో త్రివిక్రమ్ ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ పూర్తి నమ్మకం ఉంచాడనీ, కనుక ఇలాంటి విషయాల్లో ఆయన జోక్యం చేసుకునే అవకాశమే లేదని చెప్పుకునేవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో 'టబు'ను ఓకే చేస్తారా .. లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.