నటి అమలాపాల్ మెడకు కారు రిజిస్ట్రేషన్ వ్యవహారం.. విచారణకు గవర్నర్ ఆదేశం
- పన్ను ఎగవేసేందుకు నటి ఎత్తుగడ
- తప్పుడు చిరునామాతో పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్
- పలువురు నటులపైనా ఇవే ఆరోపణలు
ఈ కారును ఆమె ప్రస్తుతం కేరళలో వినియోగిస్తోంది. కారు రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జోరుగా వార్తలు రావడంతో స్పందించిన గవర్నర్ ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. అమలాపాల్, నటుడు భగత్ పాసిల్ సహా పలువురు నటులు ఇటువంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు. తప్పుడు చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించి తక్కువ పన్నులు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు.