ఇద్దరు హీరోలకు ఓ నిర్మాత నాపై లేనిపోనివి చెప్పి దూరం చేశాడు: బ్రహ్మాజీ
- ఆ నిర్మాతం నైజం అది
- ఇద్దరు హీరోలకు నన్ను శత్రువును చేశాడు
- 6 నెలల పాటు మనశ్శాంతి లేకుండాపోయింది
- చివరికి ఆయనే బయటికి వెళ్లిపోయాడు
"తన పబ్బం గడుపుకోవడం కోసం ఒకరి గురించి మరొకరికి ఆ నిర్మాత చెబుతుండేవాడు. ఒకసారి అలా హీరోల డేట్స్ సంపాదించుకోవడం కోసం నా పేరు వాడుకుని .. ఓ గొడవలో నన్ను ఇరికించాడు. అలా ఆ ఇద్దరు హీరోలకి .. నాకు మధ్య శత్రుత్వం సృష్టించాడు. ఈ కారణంగా ఓ 6 నెలల పాటు చాలా బాధపడ్డాను. ఆ తరువాత ఆ నిర్మాత ఇండస్ట్రీ నుంచే బయటికి వెళ్లిపోయాడు .. దూరమైపోయిన ఆ ఇద్దరు హీరోలు నన్ను అర్థం చేసుకున్నారు .. ఎందుకంటే నా తప్పేం లేదు. ఇప్పుడు మేం ముగ్గురం బాగానే వున్నాం" అంటూ చెప్పుకొచ్చారు.