పవన్ కి చెల్లెలి పాత్ర అనుకున్నాను .. హీరోయిన్ పాత్ర అనేసరికి ఎగిరి గంతేశాను : అనూ ఇమ్మాన్యుయేల్
- గ్లామర్ పరంగా ఆకట్టుకుంటోన్న అనూ ఇమ్మాన్యుయేల్
- యూత్ లో మంచి క్రేజ్
- తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత
- ఆ తరువాతనే తమిళ .. మలయాళ సినిమాలు
"పవన్ సినిమాలో చేయవలసి ఉంటుందని వాళ్లు చెప్పినప్పుడు, ఆయనకి చెల్లెలిగానేమోనని అనుకున్నాను. కానీ హీరోయిన్ పాత్ర కోసం అని వాళ్లు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను .. ఆనందంతో ఎగిరిగంతేశాను. ఇక ఈ సినిమా మొదటి రోజున షూటింగ్ కి కాస్త భయంగానే వెళ్లాను. కానీ అక్కడ పవన్ ని చూడగానే అన్నీ మరిచిపోయాను" అంటూ చెప్పుకొచ్చింది. "ఇక నుంచి తెలుగు సినిమాలకే నా ప్రాధాన్యత .. ఆ తరువాతనే తమిళ .. మలయాళ సినిమాలు" అనే విషయాన్ని స్పష్టం చేసింది.