200 మంది బౌన్సర్ల రక్షణలో నయనతారపై పాట చిత్రీకరణ!
- నయనతార తాజా చిత్రంగా 'వేలైక్కారన్'
- దర్శకుడిగా మోహన్ రాజా
- హీరోగా శివకార్తికేయన్
- రాజస్థాన్ .. కిషన్ ఘడ్ లో భారీ సెట్
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ ను రాజస్థాన్ - కిషన్ ఘడ్ ప్రాంతంలోని మార్బల్ లో ఒక పాటను చిత్రీకరించారట. మంచు కురుస్తున్నట్టుగా వాతావరణాన్ని క్రియేట్ చేసి .. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ పాటను తెరకెక్కించారని చెబుతున్నారు. ముందుగా ఈ పాటను కాశ్మీర్ లో ప్లాన్ చేశారట. అక్కడి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, ఇక్కడ చిత్రీకరించారు. స్థానికులు షూటింగ్ కి అంతరాయం కలిగించకుండా ఉండటం కోసం, 200 మంది బౌన్సర్లను రక్షణగా నియమించుకుని ఈ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేశారట.