ఇస్లామిక్ స్టేట్ హిట్ లిస్ట్‌లో నాలుగేళ్ల బ్రిటన్ బుల్లి రాజు
- జార్జ్‌ను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్
- ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిమ
- స్కూలు వద్ద భద్రత పెంపు
సెంట్రల్ లండన్‌లోని థామస్ బాటెర్‌సీ స్కూల్లో చదువుతున్న జార్జ్ ఫొటోతో సహా మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’లో పోస్ట్ చేసిన ఉగ్రవాదులు అతడిని చంపేస్తామని హెచ్చరించారు. అరబిక్ భాషలో రాసిన ఈ పోస్టులో ‘‘యుద్ధమనేది వస్తే మేం ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ఉంది. ‘టెలిగ్రామ్’లో మెసేజ్‌లు పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అవడం, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియకపోవడంతో ఉగ్రవాదులు ఈ ప్లాట్‌ఫాంనే ఎంచుకుంటున్నారు. ఐసిస్ హెచ్చరికల నేపథ్యంలో జార్జ్ చదువుకుంటున్న స్కూల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.