త్రివిక్రమ్ చెప్పిన కథ విని ఎన్టీఆర్ కు సూటవుతుందని చెప్పి ఒప్పించిన పవన్ కల్యాణ్!
- పవన్ కల్యాణ్ కు కథ చెప్పిన త్రివిక్రమ్
- కథ నచ్చి తనకన్నా ఎన్టీఆర్ కు అయితే బాగుంటుందన్న పవన్
- త్రివిక్రమ్ కు చెప్పి ఒప్పించాడని టాలీవుడ్ లో చర్చ
కథ విన్న తరువాత, అది చాలా బాగుందని, అయితే, తనకన్నా, ఎన్టీఆర్ కు బాగా సూటవుతుందని చెప్పి, త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ ను కుదిర్చారట. పవన్ సలహా మేరకే ఎన్టీఆర్ ను తన ప్రాజెక్టులో త్రివిక్రమ్ భాగం చేసుకున్నారని ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఓ స్టార్ హీరో కథ నచ్చిన తరువాత, తనకన్నా మరో హీరోకు నప్పుతుందని సలహా ఇవ్వడం ఇండస్ట్రీలో ఉన్న మంచి వాతావరణానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.