'సిందూరం' ఫ్లాప్ మమ్మల్ని చాలా బాధపెట్టింది : బ్రహ్మాజీ
- కేరక్టర్ ఆర్టిస్టుగా బ్రహ్మాజీకి మంచి పేరు
- 'సిందూరం'లో కృష్ణవంశీ ఛాన్స్ ఇచ్చారు
- అప్పటికే ఆయన హిట్స్ ఇచ్చి వున్నారు
- కొత్తవాళ్లతో చేయొద్దని ఆయనకి చెప్పిన వాళ్లున్నారు
" 'సిందూరం' అప్పటికే కృష్ణవంశీ 'గులాబీ' .. 'నిన్నే పెళ్లాడుతా' వంటి హిట్స్ ఇచ్చి వున్నాడు. దాంతో ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కృష్ణవంశీకి ఆఫర్లు ఇచ్చారు. ఎంతైనా తీసుకుని తమకి ఓ సినిమా చేసిపెట్టమనీ .. తమ వారసులను పరిచయం చేయమని ఎంతోమంది ప్రొడ్యూసర్లు అడిగారు. కొత్త వాళ్లతో ఎందుకు రిస్క్ అని కృష్ణవంశీతో కొందరు అన్నారు. అలాంటి సమయంలో ఆయన 'సిందూరం' కోసం నన్ను . . రవితేజను తీసుకున్నారు. నిజానికి అది చాలా మంచి సినిమా .. అయినా ఆడకపోవడంతో నేను .. రవితేజ . . కృష్ణవంశీ చాలా ఫీలయ్యాం" అని చెప్పారు.