'డ్రైవర్ రాముడు'గా కమెడియన్ షకలక శంకర్ .. ఫస్టులుక్ రిలీజ్
- కమెడియన్ గా షకలక శంకర్ కి గుర్తింపు
- హీరో వేషాల వైపు అడుగులు
- 'డ్రైవర్ రాముడు'లో హీరోగా ఛాన్స్
ఆ క్రేజ్ తోనే ఆయన 'డ్రైవర్ రాముడు' సినిమాతో హీరోగా మారుతున్నాడు. రాజు - కిషన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాజ్ సత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. 'డ్రైవర్ రాముడు'గా ఎన్టీఆర్ స్టైల్లో .. షకలక శంకర్ ఆకట్టుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకూ కమెడియన్ గా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక ముందు హీరోగా కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పాడు.