tv: టీవీ ప్రసారంలోనూ సరికొత్త రికార్డును సృష్టించిన బాహుబలి 2
- అత్యధిక ఇంప్రెషన్స్ సాధించిన బాహుబలి-ది కంక్లూజన్
- అక్టోబర్ 8న టీవీలో ప్రసారమైన చిత్రం
- వివరాలు వెల్లడించిన బార్క్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన `బాహుబలి` రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రెండో భాగమైన `బాహుబలి - ది కంక్లూజన్` చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం అక్టోబర్ 8న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా వివిధ ఛానళ్లలో ప్రసారమైంది. ప్రసారమైన అన్ని భాషల్లోనూ అధికంగా టీఆర్పీలు తీసుకువచ్చిన చిత్రంగా నిలిచింది.
అక్టోబర్ 7 నుంచి 13 వరకు హిందీలో ప్రసారమైన సినిమాల్లో అత్యధిక ఇంప్రెషన్స్ సాధించిన టాప్ 5 చిత్రాల వివరాలను బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్ ఇండియా) వెల్లడించింది. సోనీ మ్యాక్స్ ఛానల్లో ప్రసారమైన `బాహుబలి - ది కంక్లూజన్` చిత్రం 26054 ఇంప్రెషన్స్‌తో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే అర్బన్ ప్రాంతాల్లోనూ 17671 ఇంప్రెషన్స్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ఏ సినిమా సాధించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అదే వారంలో ప్రసారమైన సల్మాన్ ఖాన్ `ట్యూబ్‌లైట్` చిత్రం 5195 ఇంప్రెషన్స్ మాత్రమే దక్కించుకుంది.