టీ20 సిరీస్ కు కోహ్లీ ఔట్... రోహిత్ కు కెప్టెన్సీ?
- కోహ్లీ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన కివీస్
- విశ్రాంతి కావాలని కోరిన కోహ్లీ?
- టీ20 సిరీస్ కు కోహ్లీ దూరం
- కెప్టెన్సీ పగ్గాలు రోహిత్ శర్మకు
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పటిష్ఠ విజయ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. దీంతో కోహ్లీ చేసిన సెంచరీ వృథాగా మారింది. ఈ నేపథ్యంలో విరామం లేకుండా క్రికెట్ ఆడిన కోహ్లీ అలసిపోయాడన్న కారణంతో, కివీస్ తో టీ20 సిరీస్ కు దూరం కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతినిచ్చి, కెప్టెన్సీ పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో తీవ్రమైన ఒత్తిడి నుంచి కోహ్లీకి కొంత విశ్రాంతి లభిస్తుందని టీమిండియా భావిస్తోంది.