పవన్ కల్యాణ్ కు ఎదురెళ్లి స్వాగతం పలికిన ఎన్టీఆర్!
- నేడు ప్రారంభమైన ఎన్టీఆర్ కొత్త చిత్రం
- దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
- ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కల్యాణ్
- స్వాగతం పలికి పలకరించిన ఎన్టీఆర్
ఈ నేపథ్యంలో రామానాయుడు స్టూడియోస్ లో సందడి నెలకొంది. వందలాది మంది ఎన్టీఆర్, పవన్, త్రివిక్రమ్ అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, కుమారుడు అభయ్ రామ్ లు సినిమా ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ (వై దిస్ కొలవెరి ఫేం) తదితరులు హాజరయ్యారు. అనిరుథ్ సంప్రదాయ తమిళ వేషధారణలో ఎరుపు రంగు ధోవతి, తెలుపు రంగు కుర్తా ధరించి వచ్చాడు.