సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- హారర్ సినిమాలు చేయనంటున్న లావణ్య
- నిఖిల్ సరసన సిమ్రన్ పరీంజ
- 'లవర్' పాత్రలో రాజ్ తరుణ్
- 'మహానటి'లో నాటి రచయితగా నేటి రచయిత!
* యంగ్ హీరో నిఖిల్ సరసన సిమ్రన్ పరీంజ కథానాయికగా ఎంపికైంది. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రంలో సిమ్రన్ ను రెండో నాయికగా ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన నాయికగా సంయుక్త హెగ్డే నటిస్తోంది.
* రాజ్ తరుణ్ హీరోగా 'అలా ఎలా' ఫేం అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి 'లవర్' అనే టైటిల్ని ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం షూటింగు ఈ రోజు నుంచి జరుగుతుంది.
* కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అన్వేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మహానటి' చిత్రంలో అప్పటి ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావు పాత్రను నేటి ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ పోషిస్తారు. ఇప్పటికే ఈ చిత్రంలో కేవీ రెడ్డిగా క్రిష్, సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్ నటించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.