పవన్ కల్యాణ్ కు షూటింగ్ లో మరో ప్రమాదం.. గాయాలు చిన్నవే.. ఆందోళన వద్దన్న యూనిట్!
- ఇప్పటికే గాయాన్ని లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్న పవన్
- యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమాదం
- అభిమానులు ఆందోళన చెందవద్దన్న చిత్ర యూనిట్
- నిరంతరాయంగా సాగుతున్న షూటింగ్
ఈ ఫైట్ సీన్ లో ఇప్పటికే ఆయనకు ఓ గాయం కాగా, దాన్ని లెక్క చేయకుండా పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక తాజా ఘటనలోనూ ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ గాయం కూడా చిన్నదేనని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. తమ అభిమాన హీరోకు స్వల్ప గాయమే అయిందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, చిత్రం షూటింగ్ నిరంతరాయంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.