ఇంటర్నెట్‌తో ప్రపంచం అంతమవుతుందంటున్న జీవా.. ఆసక్తికరంగా 'కీ' టీజర్!
- ఆకట్టుకుంటున్న `కీ` తెలుగు టీజర్
- టెక్నికల్, సైకాలజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం
- `కంట్రోల్+ఆల్ట్+డై` ఉపశీర్షిక
ఇటీవల టీనేజీ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన బ్లూవేల్ గేమ్ గురించి ఈ టీజర్‌లో ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే టెక్నాలజీ అతివాడకం వల్ల వచ్చే అనర్థాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. నిక్కీ గల్రాని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించారు. `కంట్రోల్+ఆల్ట్+డై` ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రం టీజర్‌లోని డైలాగులు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.