గుణశేఖర్ 'హిరణ్యకశిప' లైన్లోనే వుంది .. టైటిల్ రోల్ లో రానా
- పౌరాణిక చిత్రాలపై పట్టున్న గుణశేఖర్
- ఆయన తదుపరి సినిమాగా 'హిరణ్యకశిప
- 'టైటిల్ రోల్ లో రానా
- సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం
అయితే అసలు ఈ పాత్రను చేయాలని రానానే ఉత్సాహం చూపుతున్నాడేది తాజా సమాచారం. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటోన్న రానా, 'హిరణ్య కశిప' పాత్ర పట్ల ఆసక్తిని చూపుతున్నాడట. దాంతో తమ బ్యానర్లో ఆ సినిమాను తెరకెక్కించాలని సురేశ్ బాబు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సురేశ్ బాబు ఇప్పటికే నాలుగైదు సార్లు గుణశేఖర్ తో చర్చలు జరిపాడని అంటున్నారు. త్వరలోనే ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.