వీరాభిమానితో మమ్ముట్టి... రోడ్డు మీద ఆగి క్షేమసమాచారాలు అడిగిన హీరో!
- ఫొటో దిగి, షేక్ హ్యాండ్ ఇచ్చిన మలయాళ నటుడు
- వైరల్ అవుతున్న వీడియో
- హీరోలకు ఆదర్శం అంటున్న నెటిజన్లు
వెంటనే ముందు సీటు నుంచి `ఇలా...రా!` అని ఓ గొంతు వినిపించింది. ముందు సీటులో వ్యక్తి అద్దం తీయగానే బాలన్ నిశ్చేష్టుడయ్యాడు. ఒక్క క్షణం బాలన్‌కి నోటమాట రాలేదు. ఆ ముందు సీట్లో కూర్చుంది స్వయంగా మమ్ముట్టి. అతన్ని చూడగానే బాలన్ సంతోషంతో పొంగిపోయాడు. మమ్ముట్టి అతన్ని ఆప్యాయంగా పలకరించాడు. క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. ఒక సెల్ఫీ కూడా దిగాడు. బాలన్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ వీడియో కూడా తీయించుకున్నాడు. ఇదంతా పక్కనే ఉన్న డ్రైవర్ సింటో తొట్టిపుల్లి వీడియో తీశాడు. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా హీరోలందరికీ మమ్ముట్టి ఆదర్శమని పొగిడేస్తున్నారు.