నాగార్జున సూచనలతో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను!: హీరోయిన్ శీరత్ కపూర్
- 'రాజుగారి గది 2'లో ముఖ్యమైన పాత్రలో శీరత్ కపూర్
- ఈ పాత్ర లభించడం పట్ల ఆనందం
- నాగ్ తో కలిసి నటించడం అదృష్టం
- చేతిలో మరో మూడు సినిమాలు
తన పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయనీ .. ఈ పాత్రను చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అంది. నాగ్ వంటి సీనియర్ స్టార్ తో .. ఓంకార్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి పనిచేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసింది. నాగ్ సలహాలు .. సూచనల వలన ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. అల్లు శిరీష్, రవితేజ సినిమాలతో పాటు, రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నానని చెప్పుకొచ్చింది.