నాకెంతో నచ్చిన పాత్రలు అవి .. అలాంటివి చేయాలనుంది : నివేదా థామస్
- నివేదా థామస్ కి వరుస అవకాశాలు
- టాలీవుడ్ లో పెరుగుతోన్న క్రేజ్
- ఛాలెంజింగ్ పాత్రలు చేయాలంటోన్న నివేదా
- ఆ తరహా పాత్రల కోసం వెయిటింగ్
'తను వెడ్స్ మను' లో కంగనా రనౌత్ .. 'బర్ఫీ'లో ప్రియాంకా చోప్రా .. 'బాజీరావ్ మస్తానీ'లో దీపికా పదుకొనే చేసిన పాత్రలు అద్భుతమని అంటోంది. ఆ తరహా పాత్రలు చేయాలని ఉందని చెబుతోంది. అలాంటి స్క్రిప్ట్స్ తో తన దగ్గరికి ఎవరొస్తారా అని ఎదురుచూస్తున్నానని అంటోంది. ఆమెకి ఆ తరహా పాత్రలు ఎప్పుడు వస్తాయా అనే విషయాన్ని అటుంచింతే, త్వరలో ఆమె సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ జోడీగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.