'మహానుభావుడు' కోసం థియేటర్లు పెంచేశారు!
- నిలకడగా 'మహానుభావుడు' వసూళ్లు
- వీకెండ్ లో పెరగనున్న జోరు
- 100 థియేటర్లను పెంచేశారు
- హైదరాబాద్ లోనే 70 థియేటర్లను కేటాయించారు
ఈ సినిమాకి పోటీగా ఈ వీకెండ్ లో మరో సినిమా ఏదీ లేకపోవడంతో, అదనంగా మరో 100 థియేటర్లను పెంచారట. ఒక్క హైదరాబాద్ లోనే 70 థియేటర్లను పెంచినట్టుగా చెబుతున్నారు. దీని వలన వీకెండ్ వసూళ్లు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక చిన్న సినిమాకి రెండవ వారంలో ఈ స్థాయిలో థియేటర్లను పెంచడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. కథ .. కథనాలు ఆ రెండింటితో కలిపి అందించిన కామెడీ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెట్టాయని అంటున్నారు.