వైసీపీ ఎంపీలు మనుషులా? లేక రాక్షసులా?.. కేంద్రానికి వీరు రాసిన లేఖలను కరపత్రాలుగా ప్రజలకు పంచండి: చంద్రబాబు
- పేదలకు కూలీ కూడా అందకుండా చేస్తున్నారు
- వీరు మనుషులు కాదు
- వీరి భాగోతాన్ని ఊరూరా ప్రచారం చేయండి
గతంలో తాను కూడా ప్రతిపక్షంలో ఉన్నానని... అయితే, రాష్ట్రానికి నష్టం వాటిల్లేలా ఎన్నడూ ప్రవర్తించలేదని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ఎంపీలు రాసిన లేఖలను కరపత్రాలుగా ఊరూరా పంచాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర వాటాతో కలిపి రూ. 8 వేల కోట్ల పనులు జరుగుతున్నాయని... దీంతో, అందరి కళ్లు మనపైనే ఉన్నాయని అన్నారు. కేంద్ర అధికారులు కూడా ఒక కన్నేసి ఉంచారని... ఈ నేపథ్యంలో, పనుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. ఖాతాలను పక్కాగా నిర్వహించాలని అన్నారు.